TELANGANA

బీఆర్ఎస్ నేతలు నా దారికి రావాల్సిందే.. కవిత సంచలన వాఖ్యలు..!

తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు స్పందించలేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు తన దారికి రావాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

బీసీ రిజర్వేషన్లపై రెండు బిల్లులు పెట్టాలని తొలుత డిమాండ్ చేసింది తానేనని కవిత చెప్పారు. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయాన్ని సమర్థించినట్టు చెప్పారు.

 

కేంద్ర జలశక్తి మంత్రితో తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల సమావేశంలో పండుగ వాతావరణం కనిపించిందని విమర్శించారు. ఈ సమావేశంలో తొలి చర్చ బనకచర్ల అంశంపైనే జరిగిందని… గోదావరి జలాలను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏపీకి అప్పజెప్పి వచ్చారని మండిపడ్డారు. టెలిమెట్రీలను ఏర్పాటు చేసే అంశంలో విషయం లేదని… కానీ రేవంత్ రెడ్డి దాన్ని తమ విజయంగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. బనకచర్ల వల్ల ఏపీకి కూడా ఉపయోగం లేదని… కేవలం కాంట్రాక్టర్ల కోసమే కుట్రపూరితంతా ఆ ప్రాజెక్టును చేపడుతున్నారని ఆరోపించారు. బనకచర్లను తక్షణమే ఆపకపోతే తెలంగాణ జాగృతి న్యాయ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.