AP

ఏపీ లిక్కర్ స్కామ్ కేసు… విచారణకు హాజరు కాలేనన్న మాజీ మంత్రి నారాయణస్వామి..

లిక్కర్ స్కామ్ కేసు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు అరెస్టయ్యారు. తాజాగా ఈ కేసులో మాజీ ఎక్సైజ్ మంత్రి నారాయణస్వామికి కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. ఈరోజు ఉదయం 10 గంటలకు సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో సిట్ అధికారులు పేర్కొన్నారు. అయితే, ఈరోజు విచారణకు హాజరు కాలేనని సిట్ అధికారులకు నారాయణస్వామి సమాచారం అందించారు. అనారోగ్యం, వ్యక్తిగత కారణాల వల్ల ఈరోజు విచారణకు హాజరు కాలేనని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో నారాయణస్వామికి సిట్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.