టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. శ్రీ వారి భక్తులకు సేవలను మరింతగా పటిష్ఠం చేయటం పైన చర్చించారు. భక్తులకు వసతి పెంపు తో పాటుగా సీఎం ఆదేశాల మేరకు శ్రీవారి సేవా విధానంలో మార్పుల దిశగా కసరత్తు చేస్తున్నారు. అలిపిరి వద్ద మౌలిక వసతులతో పాటుగా.. వసతి గురించి సమావేశంలో చర్చ జరిగింది. పెరుగు తున్న భక్తుల రద్దీకి అనుగుణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మాణం పై బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
టీటీడీ బోర్డు సమావేశంలో పలు కీలక అంశాల పైన చర్చ జరిగింది. పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. వైకుంఠం క్యూ కాం ప్లెక్స్ -3 నిర్మాణంపై చర్చించామని చెప్పారు. ఈ నిర్మాణం పైన కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ కమిటీ నివేదిక మేరకు ఈ నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అదే విధంగా.. సామాన్య భక్తులకు అదనంగా వసతి సదుపాయం అధ్యయనంపై చర్చించారు. అలిపిరి వద్ద మౌలిక సదుపాయాల కల్పనకు ఓ కమిటీని నియమించనున్నట్లు తెలిపారు. 600 మంది వేద పారాయణదారులకు నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ఆమోదించారు.
శిలాతోరణం, చక్రతీర్ధం అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఈవో శ్యాలమ రావు పేర్కొ న్నారు. దేశవ్యాప్తంగా ఆలయాల నిర్మాణ అధ్యాయానానికి ఓ కమిటీ వేయనున్నట్లు వివరించారు. శ్రీవారి సేవను విశ్వవ్యాప్తం చేసే విధంగా కో ఆర్డినేటర్ల నియామకానికి ఆమోదం తెలిపారు. సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటుకు ఆమోదించారు. కల్యాణకట్టల వద్ద పారిశుద్ధ్యం పెంపునకు, తిరుమ లలో పరిపాలన భవనాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. పాత భవనాలని తొలగించి వాటి స్థానంలో నూతన భవన నిర్మాణాాలకు ఆమోదించారు. ఒంటిమిట్ట ఆలయంలో త్వరలోనే అన్నదానం ప్రారంభించనున్నారు. రూ. 4.7 కోట్లతో అన్నదానం కోసం నూతన భవన నిర్మాణాని కి నిధులు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా ఏపీలోని పలు దేవాలయాల వద్ద భజన మండలాల నిర్మాణానికి ఆమోదం తెలిపారు.