వీకెండ్ వచ్చిందంటే చాలు.. సర్వీస్ అపార్ట్మెంట్లో మద్యం విందులు, డ్రగ్స్ వినియోగాలు, అమ్మాయిలు.. డాన్సులు.. రేవు పార్టీలు. ఇలాంటి రేవు పార్టీనే హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో వెలుగు చూపింది. ఏపీకి చెందిన ముఠా కొండాపూర్‌లోని ఎస్వీ నిలయం అనే సర్వీస్ పార్ట్‌మెంట్‌లో.. రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు.
2 కేజీల గంజాయి, కుష్ గంజాయి స్వాధీనం
దాడులు చేసిన స్టేట్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ 2 కేజీల గంజాయి, కుష్ గంజాయిని స్వాధీనం చేసుకుంది. 11.57 గ్రాముల మ్యాజిక్ ముష్రూమ్, 1.91 గ్రాముల చెరస్ డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. 9 మందిని అరెస్ట్ చేసి, 11 మందిపై కేసులు నమోదు చేసింది. ఆరు కార్లను స్వాధీనం చేసుకుంది.
డబ్బున్న వ్యక్తులను అపార్ట్‌మెంట్‌కు తీసుకొస్తున్న గ్యాంగ్
విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, రాయుడు… డబ్బున్న వ్యక్తులను రెండు రోజుల పాటు తీసుకువచ్చి ఎంజాయ్ చేయించి తిరిగి పంపిస్తుంటారన్నారు అధికారులు. నిందితులు గుట్టు చప్పుడు కాకుండా మారు పేరు, మారు బ్యాంకు అకౌంట్లు, మారు ఆధార్ కార్డులతో రేవు పార్టీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీరిని శేరింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.
రేవ్ పార్టీలు నిర్వహిస్తున్న ఏపీ ముఠాలు
అరెస్ట్ అయిన వారిలో కింగ్ కెన్ షేర్ రాహుల్… డ్రగ్స్‌ను తెప్పించే వ్యక్తిగా గుర్తించారు. ఆర్గనైజర్ ప్రవీణ్ కుమార్ అలియాస్ అశోక్ కుమార్, సాయి కృష్ణ, హిట్ జోసఫ్, కుమారస్వామి, యశ్వంత్ శ్రీ దత్, సమతా తేజలను అరెస్ట్ చేశారు. వీరితో పాటు మరో ముగ్గురుపై కూడా కేసు నమోదు చేశారు. వారు పరారీలో ఉన్నట్లు సిఐ తెలిపారు.
అంతేకాకుండా రెండు రోజుల క్రితం మాదాపూర్‌లో సైబర్ టవర్స్ దగ్గర అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకొని నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటనలో 14 మంది యువకులు, ఆరుగురు యువతులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బర్త్‌డే సందర్భంగా రేవ్ నిర్వహించారు. నిర్వాహకుడు నాగరాజ్ యాదవ్‌తో పాటు 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. విదేశీ మద్యంతో పాటు డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మళ్లీ అలాంటి ఘటనే రీపీట్ అయ్యింది. ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నారు.
కొండాపూర్ రేవ్ పార్టీలో సంచలన విషయాలు
హైదరాబాద్‌లోని కొండాపూర్ రేవ్ పార్టీలో వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేవ్ పార్టీలో కీలక వ్యక్తిగా అప్పికోట్ల అశోక్ కుమార్ అనే వ్యక్తిని గుర్తించారు. అతని వద్ద డ్రగ్స్‌తో పాటు, కండోమ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ అలవాటు ఉన్న అమ్మాయిలకు రేవ్ పార్టీల పేరుతో ఎర వేస్తూ ఉండేవాడు అశోక్. అమ్మాయిలు మత్తులో ఉన్నప్పుడు వారిపై అశోక్, అతని గ్యాంగ్ అత్యాచారానికి పాల్పడుతుండేవారు. గతంలో కూడా పలు పార్టీలు ఏర్పాటు చేసి వారితో అసాంఘిక కార్యకలాపాలుకు పాల్పడినట్లు తెలుస్తోంది.
మరో నిందితుడు రాహుల్… డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇతనిపై ఏపీ, తెలంగాణలో పలు డ్రగ్స్ కేసులు కూడా నమోదు అయ్యాయి. పట్టుబడ్డ నిందితులను ఎక్సైజ్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వారిలో ముగ్గరు అమ్మాయిలు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఒకరికి డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారించారు.