బీసీ రిజర్వేషన్ జీవో రద్దును కోరుతూ దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్‌పై విచారణకు తెలంగాణ హైకోర్టు అనుమతించింది. జస్టిస్ అభినందన్ కుమార్ శావిలి, జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది. బీసీ రిజర్వేషన్లపై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన మాధవరెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. నిన్న తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ జీవో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మాధవరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.