భారత క్రికెట్ రన్ మెషిన్ విరాట్ కోహ్లీ సుదీర్ఘ విరామం (దాదాపు 7 నెలలు) తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో రీ-ఎంట్రీ ఇచ్చి, ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి రెండు వన్డే మ్యాచ్‌లలో వరుసగా డకౌట్లు అయ్యాడు. ఇది కోహ్లీ వన్డే కెరీర్లో వరుసగా రెండు డకౌట్లు అవడం ఇదే తొలిసారి. దీంతో సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో కోహ్లీ డకౌట్ కాకూడదని అభిమానులు ఆశించారు.
అభిమానుల ఆకాంక్షకు తగ్గట్టుగానే కోహ్లీ మూడో వన్డేలో తన పరుగుల ఖాతా తెరిచాడు. ఆస్ట్రేలియా నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యంతో భారత్ బ్యాటింగ్‌కు దిగగా, శుభ్‌మన్ గిల్ ఔటైన తర్వాత వన్‌డౌన్‌లో కోహ్లీ గ్రౌండ్లోకి వచ్చాడు. ఆ సమయంలో స్టేడియం మొత్తం కోహ్లీ నామస్మరణతో మారుమోగిపోయింది. కోహ్లీ తను ఎదుర్కొన్న తొలి బంతికే సింగిల్ తీసి ఈ సిరీస్‌లో పరుగుల బోణీ కొట్టాడు.
కోహ్లీ సింగిల్ తీయగానే స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. ఇక డకౌట్ భయం నుంచి బయటపడిన కోహ్లీ కూడా ‘సాధించాను’ అన్నట్లుగా తన పిడికిలి బిగించి, నవ్వుతూ కనిపించాడు. కోహ్లీ ఈ విధంగా రియాక్షన్ ఇవ్వడం, ఆ తర్వాత అభిమానులు సంతోషంతో చప్పట్లు కొట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సిరీస్‌లో కోహ్లీ ఫామ్‌పై ఉన్న ఒత్తిడిని ఈ చిన్న సింగిల్ బ్రేక్ చేసిందనడానికి ఇది నిదర్శనం.

