బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో స్టార్ హీరోయిన్ సమంత డేటింగ్లో ఉన్నారంటూ గత కొంత కాలంగా తెగ ప్రచారం జరిగింది. త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వచ్చిన రూమర్స్‌ను నిజం చేస్తూ, సామ్-రాజ్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వివాహం అనంతరం, సమంత రాజ్‌తో కలిసి దిగిన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుని ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఈ జంట వివాహం కోయంబత్తూర్‌లోని ఇషా యోగా సెంటర్లో గల లింగ భైరవి ఆలయంలో జరిగింది. సమంత షేర్ చేసిన పెళ్లి ఫోటోలలో, సామ్ ఎరుపు రంగు చీరలో అందంగా ముస్తాబు కాగా, రాజ్ క్రీమ్, గోల్డెన్ కలర్ షర్వానీ ధరించారు. ఆ ఫోటోలలో ఇద్దరు చూడముచ్చటగా కనిపిస్తున్నారు.
గత కొంతకాలంగా సామ్-రాజ్‌ల ప్రేమాయణం, పెళ్లి గురించి రూమర్స్ వస్తున్నప్పటికీ, ఇప్పుడు వారు నేరుగా పెళ్లి చేసుకుని అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ కొత్త దంపతుల ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

