TELANGANA

పవన్ కళ్యాణ్‌కు మంత్రి కోమటిరెడ్డి మాస్ వార్నింగ్

తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. కోనసీమలోని కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ వాళ్ల దిష్టి తగలడమే కారణమని పవన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరింత సంచలనం సృష్టిస్తూ, “తెలంగాణ ప్రజల దిష్టి కాదు, ఆంధ్ర పాలకుల వల్ల తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్ విషం నీటిని తాగారు” అని అన్నారు. అంతేకాకుండా, తాను మంత్రిగా చెబుతున్నానని, పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పకుంటే ఆయన నటించిన ఒక్క సినిమా కూడా తెలంగాణలో విడుదల కానివ్వబోమని మాస్ వార్నింగ్ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ మంత్రిగా అనుభవం లేకనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. పవన్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని, అందుకే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టుబట్టారు.