TELANGANA

తెలంగాణ రైతులకు ముఖ్య గమనిక: మొక్కజొన్న నగదు ఖాతాలో పడకపోతే ఏం చేయాలి?

తెలంగాణ ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించిన మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించింది. అయితే, కొందరు రైతులకు తమ ఖాతాల్లో ఇంకా నగదు జమ కాలేదని తెలుస్తోంది. అటువంటి రైతులు వెంటనే స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. చెల్లింపుల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో, నగదు జమ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు.

తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 2.45 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించి మొత్తం 55,904 మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. రైతులకు చెల్లించాల్సిన మొత్తం రూ. 588 కోట్లను ప్రభుత్వం విడుదల చేయడంతో, నిన్నటి నుంచే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం ప్రారంభించారు. మొక్కజొన్న పంటను ప్రభుత్వం నుంచి సేకరించిన రైతులకు మాత్రమే ఈ నగదు చెల్లింపు చేస్తారు.

సాధారణంగా రైతుల ఖాతాల్లో నగదు జమ అయిన వెంటనే, బ్యాంకు ఖాతాకు లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది. మెసేజ్ రానివారు, నగదు జమ కాకపోతే, స్థానిక వ్యవసాయ అధికారిని సంప్రదించాలి. లేదా, నేరుగా బ్యాంకు వద్దకు వెళ్లి తమ ఖాతా వివరాలను చెక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.