AP

కదిరిలో అంగరంగ వైభవంగా షాహ్ మీర్ ఔలియ ఉరుసు మహోత్సవం

శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి మండలం, తలుపుల ప్రాంతంలో హజ్రత్ ఖ్వాజా సయ్యద్ షా ముహమ్మద్ హుసైని షాహ్ మీర్ ఔలియ (ర.హ) గారి 261వ ఉరుసు మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అదేవిధంగా హజ్రత్ ఖ్వాజా సయ్యద్ షా ఖాదిర్ అలి పాషా షాహ్ మీరీ గారి 22వ గంధము కూడా డిసెంబర్ 16, 2025 మంగళవారం నాడు ఘనంగా నిర్వహించబడింది.

ఈ ఉరుసు మహోత్సవాన్ని హజరత్ సయ్యద్ షాహ్ మీర్ ఖాద్రీ, సజ్జాద్ నసీన్ ఆస్థానే-షాహ్ మీర్ ఔలియ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు మరియు వివిధ రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

ఈ ఉరుసు మహోత్సవ కార్యక్రమంలో కదిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు కూడా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భక్తులు మరియు టీడీపి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరైన ఈ ఉరుసు మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా ముగిసింది.