AP

వైద్య విద్యార్థులకు శాపంగా మారిన జీవో, 590 ను రద్దు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో నిరసన.

  • వైద్య విద్యార్థులకు శాపంగా మారిన జీవో, 590 ను రద్దు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో నిరసన.
  • మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలి.
  • జీవో నెంబర్ 107,108 రద్దు చేయాలి.

కదిరి పట్టణంలోని వేమారెడ్డి కూడలిలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టడం జరిగింది. ఈ సందర్బంగా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్
మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటుచేసే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ యత్నాలను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని ప్రభుత్వ వైద్య విద్య కళాశాలలను పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (పిపిపి) విధానంలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం: 590 తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలు మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం ప్రాంతాలలోని 10 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (పిపిపి) విధానంలో రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలను ప్రైవేటీకరణ ఆపాలి వైద్య విద్య కళాశాలలను పిపిపి విధానంలో ఏర్పాటు చేయడం ద్వారా రూ.3,700 కోట్ల అభివృద్ధి ఖర్చు, ఏటా రూ.500 కోట్ల నిర్వహణావ్యయం ఆదా అవుతుందంటూ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వాస్తవానికి ఈ విధానం దీర్ఘకాలికంగా రాష్ట్రానికి నష్టం కలిగిస్తుంది. సుమారు 60 ఏళ్లపాటు ప్రభుత్వ భూమి,వనరులు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లి, వారికి ఆదాయవనరులుగా మారతాయి. వైద్య విద్య పూర్తిగా వ్యాపారపరమవుతుంది. మేనేజ్మెంట్ కోటా ద్వారా ఇచ్చే 25% సీట్లు (375) ఒక్కో సీటుకు దాదాపు రూ.50 నుండి 60 లక్షల వరకు వసూలు చేసే అవకాశం ఉంది. ఈ అధిక ఫీజు కారణంగా పేద, సామాన్య, మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్యకు పూర్తిగా దూరమవుతారు. ప్రైవేటు సంస్థల లాభాపేక్ష వల్ల వైద్య సేవల్లో నాణ్యత తగ్గడంతోపాటు, పేదవారికి ఉచిత వైద్య సేవలు అందని ద్రాక్షగా మారతాయి. పిపిపి విధానం కారణంగా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బిసి, ఈడబ్ల్యు ఎస్ వర్గాలు సుమారు 55% వైద్య విద్య సీట్లను కోల్పోవడమే కాకుండా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు రిజర్వేషన్ వర్తించేటువంటి 3,675 ప్రభుత్వ ఉద్యోగాలను కోల్పోయే పరిస్థితి ఎదురవుతుంది.నాబార్డ్ నిధులను వినియోగించి నిర్మించే వైద్య విద్య కళాశాలలను పిపిపి విధానంలో కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చే విధంగా కట్టబెట్టడంనీ ఉపసంహరించుకోవాలి. విద్య, వైద్యం అనేవి ప్రభుత్వ ఆధీనంలో కొనసాగితేనే ప్రజలకు మేలు జరుగుతుంది, పేదల ఆరోగ్య సంరక్షణపట్ల ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా స్పందించి తక్షణమే జివో నెం. 590 రద్దు చేయాలి. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్షిప్ పేరుతో కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అప్పగించే ప్రక్రియను రద్దు చేయాలి. రాష్ట్రంలోని పేద, సామాన్య, మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు మేలుచేకూర్చేలా 10 నూతన మెడికల్ కాలేజీలను పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే నిర్మించి, నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ డివిజన్ కార్యదర్శి నళ్ళజోడు పవన్ సహాయ కార్యదర్శి అసన్, టౌన్ కార్యదర్శి లియాకత్ ఆలీ,అటో యూనియన్ జిల్లా అధ్యక్షులు మధు నాయక్, టౌన్ సహాయ కార్యదర్శి మనోహర్, అదేప్ప, ఒడిసి మండల కార్యదర్శి, చలపతి నాయుడు, తనకల్లు మండల కార్యదర్శి రెడ్డప్ప, నల్లమాడ మండల కార్యదర్శి వెంకటరమణ, పూల,శ్రీనివాసులు, రైతు సంఘం నాయకులు చౌడప్ప,నాయకులు,వెంకటనారాయణ, రవి, రామచంద్ర, AISF నియోజకవర్గ కార్యదర్శి గణేష్ కుళ్ళయప్ప శ్రీను తదితరులు పాల్గొన్నారు.