- మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ప్రతిపాదిత బిల్లును ఉపసంహరించుకోవాలి
- ఈనెల 22వ తేదీన జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుటధర్నాను జయప్రదం చేయాలి
- సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ పిలుపు
గ్రామీణ పేదల జీవనాధారమైన గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పద్ధతిగా నిర్వీయం చేస్తూ, చివరకు పథకపు పేరునే మార్చే కుట్రకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పడుతుంది
వ్యవసాయసంఘం జిల్లా కార్యదర్శి బి కదిరప్ప మాట్లాడుతూ 2005 సంవత్సరంలో పార్లమెంట్‌లో గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఒక పథకంగా కాదు, ప్రజల హక్కుగా ఆమోదించబడిందని ఆయన గుర్తు చేశారు. ఈ చట్టం ప్రకారం ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి కనీసం 200 రోజుల ఉపాధి కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే.
కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం:
ఉపాధి రోజులను తగ్గిస్తోంది
కూలి రేట్లు పెంచడం లేదు
నెలల తరబడి కూలి బకాయిలు పెడుతోంది
పని కోరితే పని ఇవ్వకుండా ప్రజలను నిరాశకు గురి చేస్తోంది
చట్టానికి ఉన్న హక్కు స్వభావాన్నే దెబ్బతీయాలని చూస్తోంది
ఇవి యాదృచ్ఛిక లోపాలు కావుఇవి పేదల మీద జరుగుతున్న ఆర్థిక దాడి.
గ్రామీణ ఉపాధి పథకం వల్ల:
దళితులు, గిరిజనులు, మహిళలు, భూమిలేని కూలీలు జీవనాధారం పొందుతున్నారు
గ్రామీణ ఉపాధి పథకం పేరును మార్చే ప్రయత్నాన్ని వెంటనే ఉపసంహరించాలి
గ్రామీణ ఉపాధి చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలి
కూలి రేట్లను కనీస వేతనాలకు అనుగుణంగా పెంచాలి
పెండింగ్‌లో ఉన్న కూలి బకాయిలను వెంటనే చెల్లించాలి
పని కోరిన ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించాలి
ఈ డిమాండ్ల సాధన కోసం ఈనెల 22వ తేదీన నిర్వహించనున్న ధర్నాను గ్రామీణ ప్రజలంతా జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వెల్డింగ్ వెంక నారాయణ ఆదినారాయణ రాజు కౌలు రైతులు సంఘం జిల్లా అధ్యక్షులు చౌడప్పసిపిఐ మండల కార్యదర్శి రెడ్డప్ప రవీంద్ర తదితరు నాయకులు పాల్గొన్నారు

