AP

ప్రజల వద్దకే పాలన: కదిరిలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ‘ప్రజా దర్బార్’

సత్యసాయి జిల్లా
కదిరి నియోజకవర్గం కదిరి రూరల్ కుమ్మరవాండ్ల పల్లి గ్రామ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ప్రారంభించిన ప్రజా దర్బార్ కు విశేష స్పందన.

ప్రజాదర్బార్ కు కుమ్మరవాండ్ల పల్లి గ్రామ పంచాయతీ ప్రజలు భారీసంఖ్యలో తరలివచ్చారు. గత ప్రభుత్వంలో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని బారికేడ్లతో నిలువరించి అనేక ఇబ్బందులకు గురిచేశారు. నేడు ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని నేరుగా కలిసి విజ్ఞప్తులను స్వీకరించడంతో పాటు చిన్న చిన్న సమస్యలను అక్కడికి అక్కడే అధికారులకు చెప్పి పరిష్కరించారు,కొన్ని సమస్యల పరిష్కారానికి అధికారులకు తెలియజేసి ప్రజాదర్బార్ గ్రీవెన్స్ లో వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్లకు చెందిన అధికారులు, రూరల్ మండల నాయకులు కార్యకర్తలు,ప్రజలు పెద్ద ఎత్తున ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు.