ప్రజల శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ వాహనాలు కీలకం — జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ గారు…
ఎమ్మెల్యే సహకారం ఎంతో అభినందనీయం…
కదిరి ఎమ్మెల్యే కందికుంట సహకారంతో..
రూ, కోటి మూడు లక్షల విలువ చేసే 8 పోలీస్ వాహనాలు…
రూ, ఎనిమిది లక్షలు విలువచేసే డే విజిన్ , నైట్ విజన్2 డ్రోన్ కెమెరాలను..
జిల్లా ఎస్పీ గారికి అందజేత…
కదిరి పట్టణంలో ప్రజల శాంతి భద్రతలను సమర్థవంతంగా పరిరక్షించడంలో పోలీస్ వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయని జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ గారు తెలిపారు.
కదిరిలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వద్ద కదిరి ఎమ్మెల్యే శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారితో కలిసి పోలీస్ శాఖకు అందించిన రూ, కోటి మూడు లక్షల విలువ చేసే 8 పోలీసు వాహనాలు, నైట్ విజన్ , డే విజన్2 డ్రోన్లు, వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ…
అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే సంఘటన స్థలానికి చేరుకోవడానికి వాహనాలు ఎంతో అవసరమని అన్నారు. ప్రజల నుంచి పీజీఆర్ఎస్ ద్వారా వచ్చే ఫిర్యాదులకు త్వరితగతిన స్పందించి సమస్యలు పరిష్కరించాలంటే పోలీస్ వాహనాలు కీలకమన్నారు.
ఎమ్మెల్యే శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి సహకారంతో పోలీస్ శాఖకు సుమారు రూ.1,10,00,000/- విలువైన 8 వాహనాలు, డే విజిల్ డ్రోన్ ఒకటి నైట్ విజిన్ డ్రోన్ ఒకటి చొప్పున అందించడం సంతోషకరమని పేర్కొన్నారు. దీనిని అర్థం చేసుకుని సహకరించిన ఎమ్మెల్యే గారికి, దాతలకు జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ డ్రోన్లు నిఘా, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో కీలకంగా ఉపయోగపడతాయని చెప్పారు.
అనంతరం ఎమ్మెల్యే శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు మాట్లాడుతూ…
తాను కోరిన వెంటనే పారిశ్రామికవేత్తలైన తన స్నేహితులు సీఎస్ఆర్ నిధులు అందించారని, ఆ నిధులతో వాహనాలు, డ్రోన్లు కొనుగోలు చేసి పోలీస్ శాఖకు అందించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో కూడా పోలీస్ శాఖకు అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు.
కదిరి పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని, దాన్ని పూర్తిగా నియంత్రించేందుకు అవసరమైన సహకారం అందిస్తామన్నారు. కదిరిని స్మార్ట్ టెంపుల్ టౌన్గా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖతో సమన్వయంతో పని చేయాలని జిల్లా ఎస్పీని కోరారు.
నేరాలను పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పట్టణ శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తరఫున తాము ముందుండి అన్ని విధాలుగా సహకరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా ఎస్పీ గారు సత్యసాయి జిల్లా పోలీసుల తరఫున ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ,మరియు దాతలను శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీమతి అంకిత సురాని, డీఎస్పీ శివన్నారాయణ స్వామి , సిఐలు నారాయణరెడ్డి నాగేంద్ర నిరంజన్ రెడ్డి, టెంపుల్ అధికారులు ప్రజాప్రతినిధులు, దాతలు తదితరులు పాల్గొన్నారు.
కదిరి పోలీస్ సబ్ డివిజన్..

