AP

కదిరిలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు: కేక్ కట్ చేసిన నియోజకవర్గ ఇంచార్జ్ మక్బూల్

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు అత్యంత ఉత్సాహంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నియోజకవర్గ ఇంచార్జ్ మక్బూల్ అహ్మద్, పార్టీ నాయకులు మరియు కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మక్బూల్ మాట్లాడుతూ, జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పార్టీ కార్యకర్తలందరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని సామాన్య ప్రజలకు అండగా ఉంటూ, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. జగనన్న నాయకత్వంలోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమని, ఆయన పుట్టినరోజును పండుగలా జరుపుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

అనంతరం కార్యాలయం వద్ద కార్యకర్తలు మిఠాయిలు పంచి పెట్టి, బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకల్లో వైసిపి మున్సిపల్ కౌన్సిలర్లు, మండల స్థాయి నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు మరియు భారీ సంఖ్యలో వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు.