శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండల కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సంబరాల్లో కదిరి నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ మక్బూల్ అహ్మద్ మరియు ప్రముఖ నాయకులు పూల శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని వేడుకలను ప్రారంభించారు. జగన్ మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పార్టీ కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా పూల శ్రీనివాస రెడ్డి మరియు మక్బూల్ అహ్మద్ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన జననేత జగన్ మోహన్ రెడ్డి ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తలుపుల మండల వైసీపీ శ్రేణుల ఉత్సాహం చూస్తుంటే నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి ప్రముఖ వైసిపి నాయకులు, మండల ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. జై జగన్ అంటూ నినాదాలతో తలుపుల మండలం హోరెత్తింది. అనంతరం స్థానికులకు స్వీట్లు పంపిణీ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

