AP

కదిరిలో గ్యాస్ సిలిండర్ పేలుడు: సర్వం కోల్పోయిన పేద కుటుంబం.. రెక్కల కష్టంతో దాచుకున్న రూ. 2 లక్షలు బుగ్గి!

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి

తలువుల మండలం ఓబులరెడ్డిపల్లి గ్రామంలోని సుబ్బమ్మ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.గ్యాస్ లీక్ కావడం వల్ల జరిగిన ప్రమాదం.

ప్రమాదంలో కాలిపోయిన ఇంట్లోని మొత్తం వస్తువులు.హడావుడిగా చేరుకొని మంటలార్పిన గ్రామస్తులు.

కూలి నాలిచ్చేసి కష్టపడి దాచుకున్న రెండు లక్షల రూపాయలు మంటల్లో ఖాళీ బూడిది అవడంతో కన్నీరు మునీరుగా రోదిస్తున్న బాధితురాలు సుబ్బమ్మ

భర్త చనిపోవడంతో ముగ్గురు ఆడ పిల్లలతో కష్టపడి జీవనం కొనసాగిస్తున్న కొమ్మెర సుబ్బమ్మ.

కనీసం తినడానికి కూడా ఏమి లేకుండా పూర్తిగా కాలిపోయిన తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్న సుబ్బమ్మ.

అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితురాలు సుబ్బమ్మ కుటుంబాన్ని మనసున్న దాతలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న గ్రామస్తులు