శ్రీ సత్యసాయి జిల్లా కదిరి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్బంగా భక్తులు పోట్టేతారు.
ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు.
హిందూ సంప్రదాయంలో పవిత్రమైన రోజుల్లో వైకుంఠ ఏకాదశి ఒకటి.దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు.ఈ ఏకాదశి శ్రీమహావిష్ణువుకు ఎంతో విశిష్టమైనది.ఏకాదశి రోజున వైకుంఠ వాసుడైన శ్రీమహావిష్ణువు స్వామివారిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.ఉత్తర ద్వార దర్శనం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.

