AP

సమస్యల పరిష్కారంపై.. సహకార సంఘం ఉద్యోగుల ఆందోళన..

 

కదిరి, జనవరి 7 పట్టణంలోని ఎడిసిసి బ్యాంక్ పరిధిలోని సహకార సంఘాల సి.ఇ.ఒలు ఇతర ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ బుధవారం బ్యాంక్ ఎదుట రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. దీక్షల సందర్భంగా సంఘంలో ఎలాంటి లావాదేవీలు జరపమని పేర్కొన్నారు. ఇ.ఆర్.పి లాగిన్ చేయమని, ఎరువులు, ధాన్యం కొనుగోలు, పిడిసి, పెట్రోల్ బంకులు, మెడికల్ దుకాణాలతో పాటు ఇతర వ్యాపార సేవలు నిలిపివేసినట్లు స్పష్టీకరించారు. ఇదిలా ఉండగా.. జి.ఒ నెంబర్ 36 అమలు, ఉద్యోగ వయోపరిమితి పెంపు, వేతన సరవణ, డి.ఎల్.ఎస్.ఎఫ్ ఏర్పాటు, మార్చి 1, 2019 అనంతరం నియమితులైన ఉద్యోగులను రెగ్యులర్ చేయడం, చట్ట
ప్రకారం గ్రాట్యుటి అమలు, డ్యూటు పద్దలు రద్దు చేయడం, పూర్తిగా ఆదాయపు పన్ను మినహాయింపు, షేర్ ధనంపై డివిడెంట్ చెల్లింపు, ఉద్యోగులకు అన్ని రకాల ఋణాలు మంజూరు, డిసిసిబి డైరెక్ట్ లోన్స్ నిలుపుదల, షేర్ దనంలో సంఘాలకు వాటా కల్పన, ఇన్సురెన్స్, ఆరోగ్య భీమా, ఎం.పి.ఎఫ్.సి గోదాములు, వడ్డీ సబ్వెన్షన్ తదితర డిమాండ్లను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతులకు సేవలు అందిస్తున్న తమతో పాటు రైతుల సమస్యలు పరిష్కరించాలని స్పష్టం చేశారు. తొలుత మూకుమ్మడిగా బ్యాంక్ ఎదుట బైఠాయించి రిలే దీక్షలు ప్రారంభిస్తూ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఇతర సిబ్బంది ఆందోళనకు సంఘీభావం పలికారు