AP

వైఎస్సార్‌సీపీకి జెండా ఉంది కానీ అజెండా లేదు: ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్

  • కదిరి ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం
  • వై యస్అర్ సీపీకి జెండా ఉంది… కానీ అజెండా లేదన్న ఎమ్మెల్యే వెంకట ప్రసాద్
  • తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలను పదేపదే వైఎస్సార్సీపీ నేతలు వినిపిస్తున్నారన్న ఎమ్మెల్యే
  • రాయలసీమ కోసం 1983లోనే ఎన్టీఆర్ తెలుగు గంగా ప్రాజెక్టు తీసుకొచ్చారన్న వెంకట ప్రసాద్
    తెలుగు గంగా వాస్తవాలు ప్రజలకు తెలుసన్న ఎమ్మెల్యే
  • వైఎస్సార్సీపీ అబద్ధాలను ప్రజలు నమ్మొద్దని పిలుపు
  • హంద్రీనీవా, గాలేరు నగర్, హౌక్ రిజర్వాయర్—ఎన్టీఆర్, చంద్రబాబు కృషేనన్న వెంకట ప్రసాద్
  • రాయలసీమకు అన్యాయం చేయాలంటే ఇలాంటి ప్రాజెక్టులు ఉండేవి కావన్నారు
  • 2019–24 మధ్య మోటార్ బకాయిల భారం మా నెత్తిన వేశారన్న ఎమ్మెల్యే
  • వైఎస్సార్సీపీ పాలనపై తీవ్ర విమర్శలు

యాంకర్ వాయిస్

శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కదిరి ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ వైఎస్సార్సీపీపై తీవ్ర విమర్శలు చేశారు.వైఎస్సార్సీపీ నాయకులకు జెండా తప్ప అజెండా లేదని వ్యాఖ్యానించారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పదేపదే వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.రాయలసీమ కరువు ప్రాంతాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో
1983లోనే స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు గంగా ప్రాజెక్టును తీసుకువచ్చారని గుర్తు చేశారు.
ఈ వాస్తవాలు ప్రజలందరికీ తెలుసని మరోసారి స్పష్టం చేశారు.హంద్రీనీవా సుజల స్రవంతి, గాలేరు నగర్, హౌక్ రిజర్వాయర్ వంటి కీలక ప్రాజెక్టులు
ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు కృషి ఫలితమేనని తెలిపారు.రాయలసీమకు అన్యాయం చేయాలనుకుంటే ఇలాంటి ప్రాజెక్టులు తీసుకువచ్చేవారు కాదని అన్నారు.అలాగే 2019 నుంచి 2024 మధ్యకాలంలో మోటార్ బకాయిల భారాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే తమ నెత్తిన పెట్టి వెళ్లిందని ఆరోపించారు.
వైఎస్సార్సీపీ పార్టీ చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మొద్దని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.