శ్రీ సత్యసాయి జిల్లా కదిరి
- కదిరిలో ఘనంగా స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 219 జయంతి వేడుకలు
- వడ్డే ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్
- సమావేశంలో వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్
- సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన, ధోరణి ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం.
- టిటిడి పై కుట్రలు చేస్తున్న జగన్
- మత ప్రచారాలను ప్రోత్సహించి తోడ్పాటుకు పాల్పడిన జగన్
- హిందూ ధార్మిక సంస్థలపై దాడి కుట్ర చేస్తు అలజడికి పాల్పడుతున్న జగన్
- వాళ్లే బండి లో పోతారు మద్యం సీసాలు పెడతారు అల్లరి చేస్తారు
- రాష్ట్రంలో గాని దేశంలో గాని హిందుత్వాన్ని అనగతొక్కాలని జగన్ కుట్ర చేస్తున్నారు
- సరైన సమయం కాబట్టి వడ్డే కులస్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలి
- వడ్డీ కులస్తులందరూ ఏకమై మరోసారి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టాలి.
శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 219 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొని వడ్డే ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలను మంచి చేయాలన్న ఆలోచన ధోరణి ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని తెలిపారు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా పోయినప్పటికీ విద్వేషాలు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టిటిడి పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని మత ప్రచారం ప్రోత్సహించి తోడ్పాటుకు పాల్పడిన జగన్మోహన్ రెడ్డి హిందూ ధార్మిక సంస్థలపై దాడి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వాళ్లే బండిలో పోతారు మద్యం సీసాలు పెడతారు అల్లరి చేయాలని చూస్తారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో గాని దేశంలో గాని హిందుత్వాన్ని అణగదొక్కాలని జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని తెలిపారు.సరైన సమయం కాబట్టి వడ్డే కులస్తులకు విజ్ఞప్తి చేస్తున్న మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలి. అరాచక శక్తి జగన్మోహన్ రెడ్డిని తరిమికొట్టాలని తెలుపుతూ వడ్డే కులస్తులందరూ ఏకమై మరోసారి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టాలని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ స్పష్టం చేశారు.

