AP

కదిరిలో రూ. 32 లక్షల సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

  • సత్య సాయి జిల్లా కదిరి
  • కదిరిలో సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్.
  • 75 మంది లబ్ధిదారులకు, 32 లక్షల రూపాయల చెక్కుల పంపిణీ
  • మీడియా సమావేశంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కామెంట్స్
  • 18 నెలల కాలంలో 350 మంది లబ్ధిదారులకు మూడు కోట్ల రూపాయలు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసాం
  • కూత వేటు దూరంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కదిరి నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు
  • పండగ పూట అయిన లబ్ధిదారులకు తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో చెక్కులను పంపిణీ చేసాం
  • చరిత్రలో ఏనాడూ లేని విధంగా కదిరి నియోజవర్గంలో సీఎం సహాయనిధి చెక్కులను అందజేశాం

శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో సీఎం సహాయనిధి చెక్కులను స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ లబ్ధిదారులకు అందజేశారు.75 మంది లబ్ధిదారులకు 32 లక్షల రూపాయలు విలువ చేసే  చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలల కాలంలో నియోజకవర్గంలో 350 మంది లబ్ధిదారులకు మూడు కోట్ల రూపాయలు విలువ చేసే సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశామన్నారు. కూత వేటు దూరంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కదిరికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను విమర్శించారని అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కదిరి నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు.కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కదిరి నియోజక వర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. పండగ పూట అయినప్పటికీ పేదలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో చెక్కులను పంపిణీ చేసామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు.