కదిరి:- కడక జోన్ లోని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి:- కడప రీజియన్ లో జిల్లా ప్రజా రవాణా అధికారి యొక్క మొండి వైఖరికి నిరసనగా కడప జిల్లా లో 69 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. కాని కడప జిల్లా లో అధికారుల వైఖరి లో మార్పు రాలేదు. ప్రభుత్వానికి చెడ్ద పేరు తెచ్చేలా అధికారులు ప్రవర్తిస్తున్నారు. కడప, తిరుపతి జిల్లా అధికారుల వైఖరికి నిరసన గా జోనల్ కమిటి పిలుపు మేరకు ఈ రోజు కదిరి డిపో నందు బస్టాండు ఆవరణములో నిరాహార దీక్ష లను రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్.వి.రమణ, హరిమోహన్ లు ప్రారంభించినారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే..సమ్మెకైన వెనకాడమని నాయకులు హెచ్చరించారు. ఈ రోజు నిరహారదీక్షలలో అజీజ్, లక్ష్మీనారాయణ, అల్లా బకష్, ఆచారి, రామయ్య, గంగిరెడ్ది, ఉదయ్ భాస్కర్, నరశింహులు, చలమయ్య దీక్షలో కూర్చున్నారు. వీరికి మద్దతుగా అధ్యక్షులు రామకృష్ట, కార్యదర్శి బైరిశెట్టి, సభ్యులు సురేంద్ర, శ్రీనివాసులు, గోపాల్ నాయక్, జీవ్లానాయక్, సాయినాథ్, సుధాకర్, మల్లికార్జున, రామ్మోహన్ తదితరులు పాల్గోన్నారు.

