AP

కదిరి పద్మావతి ఆసుపత్రి ఘటన: కేసు అవసరం లేదని మృతురాలి కుటుంబ సభ్యుల వెల్లడి

కదిరి లోని పద్మావతి హాస్పిటల్ వద్ద కాన్పుకోసము వచ్చి తల్లి, బిడ్డ చనిపోయిన విషయములో, మృతిరాలి భర్త ఓబుల్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు తన భార్య మాచి రెడ్డి హరిణి కుమారి తన పురిటి నొప్పులతో గత 7 రోజుల క్రితం పద్మావతి హాస్పిటల్ నందు అడ్మిట్ కావడం జరిగిందని, అయితే ఈ రోజు ఉదయము 5:30 గంటల సమయములో ఆమెకు పురిటి నొప్పులు రావడముతో డాక్టర్ గారు పరీక్షించి కడుపులో బిడ్డ చనిపోయిందని తెలిపి సహజ కాన్పు ద్వారా బిడ్డను బయటికి తీయగా, అప్పటికే బిడ్డ చనిపోయి ఉండినదని, ఆ తరువాత అరగంటకు తన భార్యకు ఆయాసం ఎక్కువ కావడముతో ఆమె కూడా దాని నుండి కొలుకోలేక చనిపోవడముతో ఆవేశము చెందిన తన బందువులు ఆ విషయము గురించి డాక్టర్ గారిని, సిబ్బందిని ప్రశ్నించగా వారు ఇచ్చిన వివరణతో తాను, తన బంధువులు సంతృప్తి చెంది తన భార్య మరియు పుట్టిన పసిబిడ్డ మరణము విషయములో తాము సహజ మరణముగా భావించి తనకు వారు చనిపోయిన విషయములో ఎటువంటి కేసు అవసరం లేదు అని భర్త, ఇతర వారి బంధువులు పోలీస్ లకు వ్రాత మూలకంగా తెలిపినందున పోలీసులు ఈ విషయములో ఎటువంటి కేసు నమోదు చేయలేదు అని తెలియ చేయడమైనది.

ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్,
కదిరి టౌన్ పియస్.