- కదిరి రథానికి తాళ్లరేవు తాడు
- నాలుగు తాళ్లను సిద్ధం చేస్తూ..
కొబ్బరి తాళ్ల తయారీకి పేరుగాంచిన కాకినాడ జిల్లాలోని తాళ్లరేవులో 30 అంగుళాల మందం, 400 అడుగుల పొడవైన పెద్ద తాడును నేశారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరి లక్ష్మీనరసింహస్వామి రథం లాగేందుకు దీనిని వినియోగించనున్నారు. కార్మికులు తొలుత – 220 చిన్న తాళ్లను కలిపి ఒక తాడుగా చుట్టారు. అలాంటివి నాలుగు కలిపి పెద్ద తాడును నేశారు. ఇందు కోసం 300 మంది వారం రోజుల పాటు శ్రమించారు. తాడు మొత్తం బరువు 2 టన్నులని, వచ్చే నెలలో జరగనున్న రథోత్సవానికి ప్రత్యేక వాహనంలో కదిరి తరలిస్తామని తాళ్ల వ్యాపారి సూర్యప్రకాష్ తెలిపారు.

