CINEMA

ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ ఖరారు: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పూనకాలే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడటమే ఇక తరువాయి.

వాస్తవానికి మార్చి నెలాఖరున మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే, రామ్ చరణ్‌కు కవల పిల్లలు జన్మించడంతో, ఆయన వారితో సమయం గడిపేందుకు షూటింగ్ నుండి విరామం తీసుకున్నారు. దీనివల్ల ‘పెద్ది’ చిత్ర నిర్మాణం పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో మెగా అభిమానులను నిరాశపరచకుండా, ఆ ఖాళీ సమయాన్ని పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్’తో భర్తీ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన యంగ్ సెన్సేషన్ శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తుండగా, మార్చి 26న ‘ఉస్తాద్’ బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ సత్తా ఏంటో మరోసారి చూపించడానికి సిద్ధమవుతున్నాడు.