AP

రాయలసీమకు జగన్ చేసింది శూన్యం.. సీమను రతనాల సీమగా మార్చడమే చంద్రబాబు లక్ష్యం: ఎమ్మెల్యే కందికుంట

రాయలసీమకు వైఎస్ఆర్, జగన్ చేసింది శూన్యం: కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు

కృష్ణా నదిలో మిగులు జలాలు కోరబోమని వైఎస్ఆర్ బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు లేఖ రాసి రాయలసీమ రైతుల గొంతు కోస్తే… అప్పర్ భద్ర నిర్మిస్తున్నా జగన్ పట్టించుకోలేదు..

కృష్ణా జలాల్లో 512 టీఎంసీల నీటిని కేసీఆర్ తో ఒప్పించి సంతకం చేయించి చంద్రబాబు సాధిస్తే… సెక్షన్ 3పై చర్చించేలా జగన్ రెడ్డి అపెక్స్ కౌన్సిల్ లో వాదనలు వినిపించకుండా రాష్ట్రానికి ద్రోహం చేశారు. నేడు తెలంగాణ ప్రభుత్వం నీటి కేటాయింపులపై డిమాండ్ చేస్తుందంటే జగన్ నిర్లక్ష్యపు దోరణే కారణం.

ఐదేళ్ల పాలనలో 102 సాగునీటి ప్రాజెక్టులను జగన్ రెడ్డి రద్దు చేసి సీమన ఎడారి చేశాడు.

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఎలాంటి అనుమతులు లేకపోయినా రూ.3,825 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించి రూ.900 కోట్ల మట్టి పనులు చేసుకొని బిల్లులు చెల్లించుకున్నారు. 2020లో NGT ఆదేశాలు పనులు నిలిచిపోయాయి.

జగన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో రూ.12 లక్షల కోట్ల బడ్జెట్ లో సీమకు రూ.2 వేల కోట్లే ఖర్చు చేశారు.

2014-19 లో చంద్రబాబు ప్రభుత్వం రూ.12,011 కోట్లు, ఈ 19 నెలల్లో రూ.8 వేల కోట్లు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేస్తోంది.

జగన్ ఇసుక దోపిడీకి అన్నమయ్య ప్రాజెక్టుకు కొట్టుకుపోయి 39 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఫించా డ్యామ్ దెబ్బతింది. అలగనూరు బ్యాకేజీ జలాశయం గట్టు క్రిందికి కుంగి పోయింది. సెప్టెంబర్ 2021 నుండి నీటి విడుదల ఆపివేయబడింది. గాలేరు-నగరి ప్రాజెక్టుకు కీలకమైన గోరుకల్లు జలాశయం నిర్వహణ ప్రమాదంలో పడింది. 5 సంవత్సరాలలో ఒక రూపాయి కూడా జగన్ రెడ్డి విడుదల చేయలేదు. అవుకు జలాశయం నిర్వహణను గాలికొదిలేశారు.

ప్రాజెక్టు మరమ్మతులకు నిధులు ఇవ్వకపోవడంతో తుంగభద్ర డ్యామ్ 19వ క్రెస్ట్ గేట్లు కొట్టుకుపోయాయి.

కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు గారి చొరవతో క్రాష్ ప్రోగ్రామ్ లాగా పనులు చేసి కేవలం 5 రోజుల్లో గేట్లను మరమత్తు చేయించారు. ఈ చర్య ద్వారా సుమారు 40 టీఎంసీల నీటిని కాపాడగలిగాం. ప్రస్తుత తుంగభద్ర క్రెస్ట్ గేట్ల రిమోట్ కంట్రోల్ సిస్టమ్ పనులు రూ.54.42 కోట్లతో కొనసాగుతున్నాయి.

ప్రతి సంవత్సరం గోదావరిలో సముద్రంలో కలిసిపోతున్న సుమారు 3000 టీఎంసీల నీటిలో నుండి 200 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ద్వారా రాయలసీమ శాశ్వత అవసరాలను తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం

బొల్లాపల్లి జలాశయానికి 173 టీఎంసీల నీటిని నిల్వ చేయగల సామర్థ్యం కలిగి ఉండి, రాయలసీమ భవిష్యత్ అవసరాలను తీర్చడమే కాకుండా, రాయలసీమను రతనాల సీమగా చేయడమే చంద్రబాబు గారి లక్ష్యం.