తిమ్మమ్మ మాంబ మహాశివ రాత్రి ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు
సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబుల పూలకుంట మండలం తిమ్మమ్మ మర్రిమాను తిమ్మమాంబ గ్రామ మహోత్సవాలను ఎన్నడు లేని విధంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తాం, ఈశా ఫౌండేషన్ సద్గురు వారి అధ్వర్యంలో భక్తి సంస్కృతిక కార్యక్రమాలు 14,15,16, తేదీలలో 3 రోజులు పాటు ఉత్సవాలను కనివిని ఎరుగని రీతిలో నిర్వహించి, తిమ్మమ్మ మర్రిమాను క్షేత్రాన్ని పెద్ద స్థాయిలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం, ఇక్కడకి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పై ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించి దగ్గర ఉండి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి ఎటువంటి లోపాలు లేకుండా దిగ్విజయంగా ఉత్సవాలను విజయవంతంగా చేయాలని, అదేవిధంగా భద్రతాపరంగా ఎటువంటి లోపాలు లేకుండా భక్తులకు ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించడం జరిగింది. తిమ్మమాంబ ఉత్సవాలలో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు, జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తిమ్మమ్మ మర్రిమాను మహా శివరాత్రి ఉత్సవాలకు ఇదే నా ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరూ పాల్గొని శివానుగ్రహం పొందాలని కోరిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు.ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు

