ఆల్ ఖైర్ వెల్ఫేర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుపేధ కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు
కదిరి పట్టణం మదనపల్లి రోడ్డు ఆల్ ఖైర్ వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యులు ట్రస్ట్ నిర్వాహకులు అన్సర్ గారి పిలుపు మేరకు నిరుపేద కుటుంబాలకు ఆల్ ఖైర్ వెల్ఫేర్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న మంచి కార్యక్రమాలకు మా తరుపున హృదయ పూర్వక అభినందనలు తెలుపుతూ వారి అధ్వర్యంలో నిర్వహించిన నిరుపేధ కుటుంబాలకు నిత్యావసర సరుకులు వస్తువులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని కుటుంబాలకు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్, మున్సిపల్ చైర్మన్ దిల్షాద్ ఉన్నీసా, టీడీపీ నాయకులు అనిల్ కుమార్ రెడ్డి,బహుద్దీన్, కౌన్సిలర్ ఆల్ఫా ముస్తఫా,తదితరులు పాల్గొన్నారు.

