పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా కదిరిలో బిజెపి ఆధ్వర్యంలో సమర్పణ దివస్…
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షలు శ్రీ పి వి ఎన్ మాధవ్ గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ జిఎం శేఖర్ స్వామి గారి ఆదేశాల మేరకు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజు బిజెపి కదిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్ అండ్ బి బంగ్లా లో ఘనంగా నివాళులు అర్పించి సమర్పణ దివస్ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారి జీవితం, దేశసేవకు చేసిన కృషి మరియు ఆయన ప్రతిపాదించిన “సంపూర్ణ మానవతావాదం” సిద్ధాంతాన్ని విశదీకరించారు. వ్యక్తి, సమాజం, దేశం సమగ్ర అభివృద్ధి చెందాలనే ఆయన ఆలోచనలు ఈరోజు కూడా ప్రాసంగికమని వారు పేర్కొన్నారు.
కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి, స్వదేశీ ఆర్థిక విధానాల ప్రాముఖ్యతపై చర్చ జరిగింది. యువత దేశ నిర్మాణంలో సక్రియంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
చివరగా, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారి ఆశయాలను అమలు చేయడానికి అందరూ కట్టుబడి పనిచేయాలని తీర్మానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలుపుల గంగాధర్ గారు కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి శరత్ కుమార్ రెడ్డి గారు పట్టణ అధ్యక్షులు పీట్ల రామకృష్ణ, కదిరి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ షేక్ సమీవుల్లా, మాజీ జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు భార్ ఇంతియాజ్ గారు, ఓబిసి మొట్ట జిల్లా జనరల్ సెక్రటరీ మురళి, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు దస్తగిరి, కిసాన్ మర్చ ఐటీ సెల్ కన్వీనర్ నాగవర్ధన్ రెడ్డి, పట్టణ మాజీ అధ్యక్షుడు పట్టా రమేష్ బాబు, మాజీ జిల్లా కార్యదర్శి అశోక్ కిష్టప్ప రూరల్ మండలం ఉపాధ్యక్షుడు చలపతి, పట్టణ ఓబిసి మోర్చా అధ్యక్షుడు జరిపిటి జయరాజు, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు ముచ్చుకోట్ల గోవర్ధన్, బిజెపి నాయకులు తలుపుల రామాoజులు, కిష్టప్ప,శివప్రసాద్ రెడ్డి, హనుమంత్ రెడ్డి మైనారిటీ మోర్చా జిల్లా కార్యదర్శి పఠాన్ రిహాన, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి పూజ తదితరులు పాల్గొనడం జరిగింది

