కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి అధ్వర్యంలో తిమ్మమ్మ మర్రిమాను లో ఘనంగా ప్రారంభమయిన తిమ్మమాంబ,మహాశివరాత్రి ఉత్సవాలు
సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం ఎన్.పీ.కుంట మండలం తిమ్మమ్మ మర్రిమాను (గూటి బైలు) గ్రామంలో ఘనంగా ప్రారంభమయిన తిమ్మమాంబ మహాశివరాత్రి ఉత్సవాలు 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలను ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడం జరిగింది.
ఆదిలాబాద్ గుస్సాడి నృత్యాలతో, హిమాన్షు శాస్త్రీయ భరత నాట్యంతో కళాకారులు అద్భుతంగా అలరించారు.
అనంతరం తిమ్మమాంబ అమ్మ వారిని దర్శించుకుని పూజలు చేసి తిమ్మమాంబ రథోత్సవాన్ని ప్రారంభించారు,
అనంతరం కళాకారులను సన్మానించి వారికి అభినందనలు తెలిపారు.
రేపు జరగబోయే మహా శివరాత్రి ఉత్సవం ఈశా ఫౌండేషన్ సద్గురు టీం వారిచే పల్లకి సేవ,ఆది యోగి శివుడి ఊరేగింపు, రుద్రాభిషేకం,హోమం బ్రహ్మాండమైన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు తెలిపారు.

