AP

కదిరిలో వైభవంగా తిమ్మమ్మ మర్రిమాను మహాశివరాత్రి ఉత్సవాలు: ఆదియోగి పల్లకి సేవలో పాల్గొన్న ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే కందికుంట

కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి అధ్వర్యంలో కన్నుల పండుగగా తిమ్మమ్మ మర్రిమాను తిమ్మమాంబ మహాశివ రాత్రి ఉత్సవాలు

మహాశివరాత్రి సందర్భంగా తిమ్మమ్మ మర్రిమాను తిమ్మమాంబ మహాశివ రాత్రి ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు ఈశా ఫౌండేషన్ సద్గురు టీం వారిచే ఆదియోగి పల్లకి సేవ ఉత్సవం,శివాంగ స్ఫూర్తి,రుద్రాభిషేకం,తిమ్మమ్మ గారి జీవిత చరిత్ర గానం,సాంస్కృతిక కార్యక్రమాలు పెద్దఎత్తున విచ్చేసిన భక్తులుకు అన్నదానం కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి.కే.పార్థసారథి,జాయింట్ కలెక్టర్ అభిషేక్ మౌర్య,బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఏం.ఎస్. పార్థసారథి,పలువురు అధికారులు,నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు