తాడిమర్రి, ఫిబ్రవరి 23:(YES9TV)
ఆదివారం తాడిమర్రి మండలంలోని చిల్ల కొండయ్యపల్లి గ్రామంలో జరిగిన సందీప్–చందన వివాహ కార్యక్రమానికి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించి వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు.
తదుపరి మండలంలోని వైసీపీ నాయకులతో కలిసి తాడిమర్రి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక రాజకీయ, అభివృద్ధి అంశాలపై నాయకులతో చర్చించారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఆరవేటి కాటమయ్య, ఆరవేటి శివ, ఆరవేటి గురు ప్రసాద్, బోయ విశ్వనాథ్ తదితర నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

