AP

కదిరి పుణ్యక్షేత్రంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాల అంకురార్పణ: సరికొత్త డిజిటల్ సేవలను ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట దంపతులు

*అంకురార్పణ పూజ కార్యక్రమంలో పాల్గొనుటకు ఆలయ ప్రధాన అర్చకులను స్వాగతం పలికిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి దంపతులు*

కదిరి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన Ai ఆన్లైన్ టికెట్ల దర్శనం,ఈ హుండీ, కేసఖండన, ఆటో మేటిక్ టికెట్ వెండింగ్ మిషన్స్ సేవలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఆయన సతీమణి శ్రీమతి కందికుంట యశోద దేవి గారు మరియు పచ్చిపులుసు సురేష్ (సూరి) గారు
అనంతరం స్వామి వారి గుడి లో ధాత సహాయకారంతో ఏర్పాటు చేసిన సెంటర్ AC నీ కందికుంట వెంకటప్రసాద్ గారి దంపతులు,మరియు పచ్చిపులుసు సురేష్ గారి దంపతులు స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.
అనంతరం స్వామి వారి పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారికి కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి దంపతుల చేతుల మీదుగా స్వయంగా పట్టువస్త్రాలు సమర్పించారు.
అనంతరం అంకురార్పణ పూజ కార్యక్రమంలో ప్రారంభించే ముందు ఎమ్మెల్యే గారి దంపతులు స్వయంగా ఆలయ ప్రధాన అర్చకుల ఇంటికి వెళ్లి వారి ఆశీర్వాదం తీసుకుని ఆలయ ప్రధాన అర్చకులని గౌరవప్రదంగా ఆహ్వానించి స్వాగతం పలకడం జరిగింది.
ఎన్నడు లేని విధంగా ఏ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇలా తమ ఇంటికి వచ్చి గౌరవప్రదంగా మమ్మల్ని ఆహ్వానించి మాతో పాటు శ్రీవారి సేవలో ఎవరు ఇలా పాల్గొనలేదు అని సంతోషం వ్యక్తం చేసిన ఆలయ ప్రధాన అర్చకులు వసంత ఆచార్యులు, పార్థసారథి చార్యులు వారు