శ్రీ సత్య సాయి జిల్లా
నంబులపూలకుంట మండలం ఎదురుదోన సచివాలయంలో పనిచేస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్, చంద్రశేఖర్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి రాంప్రసాద్ పింఛన్ సొమ్ము ను స్వాహా
2.22 లక్షల పింఛన్ సొమ్మును స్వాహా చేసినట్లు సమాచారం
ఫిబ్రవరి నెల పెన్షన్ పంపిణీ చేయగా మిగిలిన డబ్బును బ్యాంకులో జమ చేయకుండా సొంతానికి వాడుకున్న వెల్ఫేర్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి.
ఇరువురి పై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపిన ఎంపీడీవో పార్థసారథి
శ్రీ సత్య సాయి జిల్లా నంబుల పూలకుంట మండలం ఎదురుదోన సచివాలయంలో పనిచేస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి రాంప్రసాద్ పెన్షన్ సొమ్ము రెండు లక్షల ఇరవై రెండు వేల రూపాయలను స్వాహా చేశారు. ఫిబ్రవరి నెలలో పెన్షన్ పంపిణీ చేయగా మిగిలిన సొమ్మును బ్యాంకులో జమ చేయాల్సి ఉండగా జమ చేయకుండా ఈ సొమ్మును వెల్ఫేర్ అసిస్టెంట్ లక్ష 70,000 పంచాయతీ కార్యదర్శి 52,000 సొంతానికి వాడుకున్నారు. అయితే పంచాయతీ కార్యదర్శి ప్రమోషన్ పై ఇటీవల సత్యసాయి జిల్లా పరిగి మండలానికి బదిలీ అయ్యారు స్వాహా చేసిన సొమ్మును జమ చేసిన తర్వాత బదిలీపై వెళ్లాలని ఎంపీడీవో పార్థసారథి పంచాయతీ కార్యదర్శుని ఆదేశించారు. కాగా ఈ విషయంపై ఇరువురి పై ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని ఎంపీడీవో పార్థసారథి తెలిపారు.

