ప్రెస్ నోట్
ఉమెన్స్ డే సందర్భంగా క్రీడాకారిణులు సిరి, నికితకు సన్మానం
సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్.ఎస్. స్పోర్ట్స్ అకాడమీ కోచ్ షేక్షావలి ఆధ్వర్యంలో బ్లూ మూన్ విద్యాసంస్థ విద్యార్థినులు కరాటే, ఫెన్సింగ్, బాక్సింగ్, జూడో, వోవినం వంటి క్రీడల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఎస్.ఎస్. స్పోర్ట్స్ అకాడమీ కోచ్ షేక్షావలి శిష్యురాళ్లు, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణులు సిరి మరియు నికితలను ఉమెన్స్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసా పత్రం మరియు షీల్డ్ అందజేసి సన్మానించింది. విద్యార్థినులు చేసిన కరాటే ప్రదర్శనలు అక్కడున్న వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమానికి హాజరైన సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు మరియు జిల్లా అడిషనల్ ఎస్పీ అంకిత గారు విద్యార్థినుల ప్రతిభను అభినందించారు. మహిళలు ధైర్యంగా ముందుకు రావడానికి క్రీడలు ఎంతో సహాయపడతాయని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కరాటే మాస్టర్ షేక్షావలి మాట్లాడుతూ విద్యార్థినులు క్రీడల్లో ముందుకు రావాలని, ప్రతి అమ్మాయి ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం చాలా అవసరమని తెలిపారు.
ఈ అవార్డు సాధించిన విద్యార్థినులు సిరి, నికితలను బ్లూ మూన్ స్కూల్ అధినేత మంచి శివశంకర్ గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేందర్ రెడ్డి గారు, మాధవరెడ్డి గారు, రామానుజలు రెడ్డి గారు అభినందనలు తెలిపారు.

