ఈ మల్టీప్లెక్స్‌లోని స్క్రీన్ 1 (డాల్బీ సినిమా) ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. 75 అడుగుల భారీ వెడల్పుతో ఉన్న ఈ స్క్రీన్, ప్రస్తుతం భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్ కావడం గమనార్హం. ఇందులో డ్యూయల్ డాల్బీ విజన్ మరియు 6P లేజర్ ప్రొజెక్షన్ సిస్టమ్‌ను ఉపయోగించారు. దీనివల్ల విజువల్స్ అత్యంత స్పష్టంగా, వైబ్రెంట్ కలర్స్‌తో కనిపిస్తాయి. ముఖ్యంగా త్రీడీ (3D) సినిమాలకు ఈ స్క్రీన్ ‘ది బెస్ట్’ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుందని జర్నలిస్టుల విజిట్ సందర్భంగా నిరూపితమైంది.
సౌండ్ క్వాలిటీ విషయంలో కూడా ఈ థియేటర్ నెక్స్ట్ లెవల్‌లో ఉంది. మొత్తం 634 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ ఆడిటోరియంలో 78 స్పీకర్లు, 165 సౌండ్ ఔట్ లెట్స్ ఏర్పాటు చేశారు. దీనివల్ల ప్రతి చిన్న శబ్దం కూడా చాలా స్పష్టంగా వినబడుతుంది. నేపథ్య సంగీతం (BGM) ప్రాధాన్యత ఉన్న సినిమాలకు ఈ హియరింగ్ ఎక్స్‌పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది. ఫ్లాగ్ షిప్ డాల్బీ సినిమా ఆడిటోరియంగా పిలవబడే ఈ స్క్రీన్, హాలీవుడ్ స్థాయి టెక్నికల్ స్టాండర్డ్స్‌ను కలిగి ఉంది.
ఈ ప్రధాన స్క్రీన్‌తో పాటు ‘అల్లు సినిమాస్’లో మరో మూడు స్క్రీన్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో బార్కో 4K లేజర్ ప్రొజెక్షన్ మరియు డాల్బీ అట్మోస్ సరౌండ్ సౌండ్ సిస్టమ్‌ను అమర్చారు. ఈ మూడు స్క్రీన్‌ల మొత్తం సీటింగ్ కెపాసిటీ 717. ఇప్పటికే ప్రసాద్స్ ఐమాక్స్ వంటి థియేటర్లకు అలవాటు పడిన హైదరాబాద్ సినీ ప్రేక్షకులకు, కోకాపేట్‌లోని ఈ అల్లు సినిమాస్ ఒక సరికొత్త గమ్యస్థానంగా మారబోతోంది.

