AP

కదిరిలో ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం: ‘టీబీ అంతం – మన పంతం’ అంటూ భారీ ర్యాలీ

ఈరోజు ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా కదిరి టీబి యూనిట్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ జరిగింది ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ నాగేంద్ర నాయక్ మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు ఉన్న సాయంత్రం పూట జ్వరము వస్తూ ఉన్న దగ్గినప్పుడు గళ్ళలో రక్తం పడిన బరువు తగ్గిపోతున్న వారు దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రులలో గల్ల పరీక్ష మరియు వీలైతే ఎక్సరే కూడా చేయించుకోవాలి ఒకవేళ వ్యాధి నిర్ధారణ అయితే వారికి ఆరు నెలలు మందులు ఉచితంగా అందజేస్తూ వారి పౌష్టిక ఆహారం కొరకు నెల నెల రోగి యొక్క ఖాతాలో వెయ్యి రూపాయలు జమ చేస్తారు అని తెలియజేశారు సూపర్వైజర్ శ్రీనివాసులు మాట్లాడుతూ రాబర్ట్ కోచ్ బ్యాక్టీరియాని 1882 మార్చి 24వ తారీఖున కనుగొనడం వల్ల ప్రతి సంవత్సరము క్షయ వ్యాధి గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసము మార్చి 24వ తేదీ ప్రపంచ నివారణ దినోత్సవం గా చేసుకుంటామని తెలియజేశారు అంతేకాకుండా ఏప్రిల్ రెండు నుంచి ఇంటెన్సీ పైడ్ టీబీ సర్వే గురించి తెలియజేశారు తెలియజేయడం జరిగింది కదిరి పురవీధుల్లో టీబీ ఓడిపోతుంది దేశం గెలుస్తుంది అనే నిదానంతో ర్యాలీ చేయడం జరిగింది. టవర్ క్లాక్ దగ్గర మానవహారంగా ఏర్పడి టీబీ అంతం మన పంతం అని ప్రతిజ్ఞ చేయించడం జరిగిందిఈ కార్యక్రమంలో కదిరి కస్తూరిబా స్కూల్ విద్యార్థినులకు పెట్టిన వకృత్వపోటీలలో ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేస్తూ 18 మందికి కన్సోలేషన్ బహుమతులుకూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రియ మరియు ఎం పి హెచ్ ఎస్ మురళీధర్ ముస్తఫా ఫిమేల్ సూపర్వైజర్ కృష్ణ కళా మరియు హెడ్ నర్సులు జయమ్మ సులోచన మరియు టి బి హెచ్ వి పద్మావతి ఎల్టి శిరీష మరియు విశ్వనాథ్ ఆరోగ్య కార్యకర్తలు ఆశలు ఐసిటిసి సిబ్బంది పాల్గొన్నారు