“నేను దేశ రాజకీయాల్లో పనిచేయాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. మోడీ త్రీడి పాలసీకి వ్యతిరేకంగా దక్షిణ భారతం ఐక్యం కావల్సి ఉంది” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కేరళ, తెలంగాణ, ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక నుంచి కేంద్రంలో తక్కువ ప్రాతినిధ్యం ఉంది” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ పై పోరాటానికి సిద్ధం కావాలన్నారు. వెంకయ్య నాయుడును రాష్ట్రపతి ఎందుకు చేయాలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు దక్షిణాది నుంచి రాష్ట్రపతులు అయ్యారని సీఎం గుర్తుచేశారు. కాంగ్రెస్.. దేశం మొత్తం ఒక్కటే అన్న సందేశం ఇచ్చిందననారు. బీజేపీకి సొంత నేతలపైనే నమ్మకం లేదన్నారు.
మూసీ వద్ద బాపూ ఘాట్
“రాహుల్ గాంధీ దేశం గురించి ఆలోచిస్తున్నారు. నిర్ణయాలు తీసుకునే ముందు ఆల్ పార్టీ మీటింగ్ కి పిలుస్తున్నారు. తెలంగాణ మోడల్ చాలా రేర్. అహ్మదాబాద్ కి హైదరాబాద్ తో పోలిక లేదు. గుజరాత్ లో టాక్స్ హాలిడే అనుమతులు ఇస్తున్నారు. పెట్టుబడులు పెట్టడానికి ప్రధాని గుజరాత్ ను సూచిస్తున్నారు. తెలంగాణ కూడా దేశంలో భాగమే. దేశానికి బ్రాండ్ అంబాసిడర్ లా ప్రధాని మోదీ వ్యవహరించాలి. గుజరాత్ మోడల్ ను తెలంగాణ మోడల్ అనుకరిస్తుందన్న దానిపై స్పందిస్తూ.. మంచి నిర్ణయాలు ఎక్కడున్నా పాటిస్తాం. గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ చేశారు. హైదరాబాద్ లో మూసీ రివర్ ఫ్రంట్ చేస్తుంటే బీజేపీ అడ్డుకుంటుంది. మహాత్మా గాంధీ విగ్రహానికి రూ.70-80 కోట్లు ఖర్చు చేస్తున్నాం. మూసీ నది వద్ద బాపు ఘాట్ ఏర్పాటు చేస్తున్నాం.” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
కేంద్ర, రాష్ట్ర సంబంధాలు బావుండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి మూడు బుల్లెట్ రైళ్లు ఇచ్చినందుకు కేంద్రానికి కృతఙ్ఞతలు తెలిపానన్నారు. మోదీ మంచి చేస్తే మంచి చేశారని చెబుతానని, తప్పు చేస్తుంటే తప్పని చెబుతానన్నారు. ప్రజల సమస్యల ఆధారంగా గ్యారెంటీలు అమలుచేస్తున్నామన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామన్నారు. ఆర్థిక వనరులు తక్కువ ఉన్నాయి కాబట్టి కొన్ని పెండింగ్ లో ఉన్నాయన్నారు.
11.90 వడ్డీకి 2 లక్షల కోట్ల అప్పు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 6-7 శాతం వడ్డీ వదిలేసి, అధిక వడ్డీలకు అప్పులు తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. నచ్చితే నజరానా నచ్చకపోతే జరిమానా అన్నట్లుగా గత ప్రభుత్వ వైఖరి ఉండేదన్నారు. సోలార్ ఎనర్జీ ద్వారా దేశాన్ని కాపాడాలని ప్రతి రోజు సూర్య భగవానుని ప్రార్థిస్తున్నానన్నారు. బంగ్లాదేశ్,శ్రీలంక,చైనా,అమెరికా ఏ దేశం కూడా భారతతో కలిసి పనిచేయడంలేదన్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపి విద్యార్థులను తీసుకువచ్చినట్లు యుద్ధాన్ని ఆపి చమురు తీసుకురావచ్చు కదా, దేశంలో గ్యాస్, పెట్రోల్ కొరత ఏర్పడుతుందన్నారు. ఈ సమయంలో మోదీకి మద్దతుగా ఉంటామన్నారు. మోదీ యాక్షన్ ప్లాన్ ఏంటో తెలపాన్నారు. ట్రంప్ ఫోన్ చేసి భారత్ పాక్ యుద్ధాన్ని అయినట్లు, మోదీ ట్రంప్ కి ఫోన్ చేసి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని ఆపాలని కోరారు.
పదవుల కోసం పాకులాట
“కేసీఆర్ నాకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే నాకు వ్యక్తిగతంగా సమస్యలు లేవు. కేసీఆర్ కుటుంబంలోని వారే పదవుల కోసం పాకులాడుతున్నారు. వారసత్వ రాజకీయాలు కోసం కూతురు, కొడుకు పోటీ పడుతున్నారు. హరీష్ ముఖ్యమంత్రి అవుతానంటున్నారు. కేసీఆర్ ది కుటుంబ సమస్య. పార్లమెంట్ లో బీఆర్ఎస్ కి గుండు సున్నా వచ్చింది, ఆ తరువాత ఎన్నికల్లో డిపాజిట్లు పోయాయి, తెలంగాణలో ఉప ఎన్నికలు, పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కేటీఆర్ బెట్టింగ్ పెట్టించారు, అయినా ఓడిపోయారు. నాకు తెలంగాణ ప్రజలు 2024-34 వరకు అవకాశం ఇస్తారు”- సీఎం రేవంత్ రెడ్డి

