శ్రీ సత్య సాయి జిల్లా..
ఆపరేషన్ ‘వజ్రప్రహార్’లో భాగంగా మంగళమడక , ఎన్.పి కుంట గ్రామాలలో కార్డెన్, సర్చ్ నిర్వహించిన పోలీసులు.
జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాలతో కార్డన్ & సెర్చ్.
మత్తు పదార్థాల నిర్మూలనపై ఉక్కుపాదం.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. హెచ్చరించిన పోలీసులు..
శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా, మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు, *జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు* పోలీసులు “ఆపరేషన్ వజ్రప్రహార్” లో భాగంగా మెరుపు దాడులు నిర్వహించారు. బుధవారం తెల్లవారుజామున ముదిగుబ్బ మండలంలోని
మంగళమడక, ఎన్. పి కుంట లోని ఎస్టీ కాలనీలో తెల్లవారుజాము నుండే భారీ కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
అధునాతన డ్రోన్లతో పర్యవేక్షణ*
నేరగాళ్ల కదలికలను కనిపెట్టేందుకు మరియు మారుమూల ప్రాంతాలను తనిఖీ చేసేందుకు ఈ ఆపరేషన్‌లో అధునాతన డ్రోన్ కెమెరాలను ఉపయోగించారు. ఖాళీ భవనాలు, నిర్మానుష్య ప్రదేశాలను డ్రోన్ల ద్వారా క్షుణ్ణంగా వీడియో రికార్డింగ్ చేస్తూ తనిఖీలు చేపట్టారు.
పోలీసుల ప్రత్యేక బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.
తనిఖీల్లో భాగంగా సరైన ధృవీకరణ పత్రాలు లేని పలు ద్విచక్ర వాహనాలను, ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. పాత నేరస్థులు, అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి వారి ప్రస్తుత కార్యకలాపాలపై ఆరా తీశారు.
ముఖ్యంగా యువతను పట్టిపీడిస్తున్న గంజాయి, డ్రగ్స్, కూల్-లిప్స్ మరియు నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు.
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చట్టాలను ప్రయోగిస్తాం.” అని సిఐ లు స్పష్టం చేశారు.
ప్రజా చైతన్యం – ప్రతిజ్ఞ
ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ముదిగుబ్బ ఆఫ్ గ్రేడ్, రూరల్ సర్కిల్ సి ఐ లు సునీత ,శివరాముడు , ఎస్సైలు సుమిత, కృష్ణమూర్తి , హర్షద్ ,కేతన్న పోలీసు పాల్గొన్నారు.
ప్రజలకు విన్నపం…
మీ ప్రాంతంలో ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినా లేదా మత్తు పదార్థాల విక్రయాల గురించి సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. మీ వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయి.
అత్యవసర సహాయం కోసం: డయల్-112
మత్తు పదార్థాల సమాచారం కోసం (ఈగల్ టోల్ ఫ్రీ): 1972
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిరంతరం ఇలాంటి ఆపరేషన్లు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.
పుట్టపర్తి జిల్లా పోలీస్ కార్యాలయం.

