అనంతపురం జిల్లా RDT సంస్థకు సంబంధించిన ‘విదేశీ విరాళాల నియంత్రణ చట్టం’ (FCRA) నమోదు పునరుద్ధరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుండి సానుకూల నిర్ణయం వెలువడిన సందర్భంగా ఈ అంశానికి సంబంధించి సహకారం అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరియు ఐటీ మంత్రి నారా లోకేష్ గారిని అభినందనలు తెలుపుతూ ఈరోజు కదిరి నియోజకవర్గంలో పాలాభిషేకం నిర్వహించడం జరిగింది.
అవిభక్త అనంతపురం జిల్లా ప్రజల సామాజిక-ఆర్థిక పరిస్థితులు, RDT సంస్థ అందించిన సేవలు, గ్రామీణాభివృద్ధికి ఆ సంస్థ చేసిన కృషి వంటి వివిధ అంశాలపై అవగాహన చేసుకోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు.
కేంద్రం ప్రభుత్వాన్ని ఒప్పించడంలో రాష్ట్ర నాయకత్వం కీలక పాత్ర పోషించిందని స్థానిక నాయకులు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ మరియు జనసేన పార్టీల ఆధ్వర్యంలో కదిరి పట్టణంలోని శ్రీ కృష్ణదేవరాయల విగ్రహం వద్ద ఈ ప్రక్రియలో పాలుపంచుకున్న ముఖ్య నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేనలకు చెందిన స్థానిక బీజేపీ రాష్ట్ర నాయకులు ఉత్తమ్ రెడ్డి, జనసేన అసెంబ్లీ ఇన్చార్జి బైరవప్రసాద్, బీజేపీ, జనసేన జిల్లా నేతలు , రవికుమార్,సుదర్శన్, అంజి, హస్నాపురం చంటి, చిన్నపరెడ్డి, డిఎల్ ఆంజనేయులు, ప్రసాద్, నాగార్జున, మైనుద్దీన్, రమేష్, అంజిబాబు, రాజేంద్ర ప్రసాద్, గంగరాజు, రవీంద్ర, సోమశేఖర్, రాజారామ్, రామమోహన్, హరి బాబు, శరత్ కుమార్ నంది శెట్టి బాబు, కృష్ణమూర్తి, కుటాగుల సూరి, వడ్డెర సంఘం అధ్యక్షుడు సైదాపురం రమణ, గంగాధర్ తదితరులు పాల్గొని తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.
అలాగే, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమని బీజేపీ, జనసేన నాయకులు పేర్కొంటూ, ఈ ప్రక్రియకు సహకరించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పాలాభిషేకం నిర్వహించారు.
బీజేపీ, జనసేన నాయకులు మాట్లాడుతూ RDT సంస్థను 1969లో Vincent Ferrer మరియు ఆయన సతీమణి అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా స్థాపించారు. పేదరి నిర్మూలనే లక్ష్యంగా ఈ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో బోరుబావుల తవ్వకం, నిరుపేదల కోసం ఇళ్ల నిర్మాణం చేసి ఉచితంగా అందించడం, అలాగే లక్షలాది మంది రోగులకు వైద్య సేవలు అందించేందుకు బత్తలపల్లి, కళ్యాణదుర్గం ప్రాంతాల్లో ఆసుపత్రులను స్థాపించడం వంటి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న తాజా నిర్ణయాల ఫలితంగా RDT సంస్థ మరింత బలోపేతమై ప్రజలకు విస్తృత స్థాయిలో సేవలు అందించగలుగుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.

