AP

అరటి తోటకు నిప్పు.. 6 వేల చెట్లు అగ్నికి ఆహుతి..

 

ఓబులవారిపల్లి మండలంలోని పెద్దఓరంపాడు గ్రామంలో ఆకతాయిలు నిప్పుపెట్టడంతో 5 ఎకరాల అరటి తోట దగ్ధమైంది. వల్లూరుపల్లికి చెందిన కొత్త పిచ్చమ్మ, రామసుబ్బారెడ్డి దంపతులకు చెందిన 6 వేల అమృతపాణి రకం అరటి చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి.

కోతకు సిద్ధంగా ఉన్న పంటను ఉద్దేశపూర్వకంగా తగులబెట్టారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనలో సుమారు రూ.6 లక్షల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. డ్రిప్ పైపులు, ఇతర పరికరాలు కూడా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.