AP

ఆర్డీటీ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ (FCRA) రెన్యూవల్‌పై హర్షం: కదిరిలో క్రికెటర్ల కేక్ కటింగ్ వేడుకలు

RDT FCRA రెన్యూవల్ పట్ల క్రికెటర్ల హర్షం

ఇటీవల ఉమ్మడి జిల్లాలకు వరం లాంటి ఆర్డీటీ సంస్థకు ( FCRA ) లైసెన్స్ రెన్యూవల్ అవడం తో ప్రతి ఒక్కరు హర్షించారు.అందులో భాగంగా ఈరోజు ప్రభుత్య డిగ్రీ కళాశాల మైదానం నందు గల క్రికెట్ నెట్స్ నందు కదిరి వర్ధమాన, పూర్వ క్రికెటర్లు, క్రికెట్ శ్రేయోభిలాషులు కేక్ కట్ చేసి ఆనందం పంచుకొన్నారు.

ఈ కార్యక్రమానికి ఆర్డీటీ కదిరి రీజియన్ RD రఘురామ్, నల్లచెరువు ఏరియా ATL సుకన్య గారు విచ్చేసి FCRA, సంస్థ చేపట్టిన వివిధ కార్యక్రమాల గురుంచి అవగాహన కల్పించారు మరియు సంస్థ కోసం ప్రార్థించిన, అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియచేసారు.
ఈ కార్యక్రమం లో కదిరి మండల క్రికెట్ సంఘం కార్యదర్శి ఎల్లప్ప, కోశాధికారి ముబారక్., కదిరి క్రికెట్ క్లబ్ సభ్యులు కరుణ, ఆస్లాం, రామకృష్ణ & సభ్యులు, ప్లేయర్స్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, క్రీడాకారుల తల్లితండ్రులు, క్రికెట్ కోచ్ తదితరులు పాల్గొన్నారు…

ధన్యవాదములు…
విధేయులు
కదిరి క్రికెట్ క్రీడాకారులు