మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమం కోసం,అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి కోసం విభజనకు ముందు విభజన తర్వాత అప్పటి కేంద్రం వేసిన శ్రీకృష్ణ, శివరామకృష్ణ కమిటీలకు ఏమాత్రం విలువ ఇవ్వని ఈ కూటమి ప్రభుత్వం ఈ అమరావతి రాజధాని పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర చేస్తూనే ఉన్న ఆగిత్యం అంతాఇంతా కాదన్నది జగమెరిగిన నగ్న సత్యము…….
…. 1956నుండి2014వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలకులుగా వచ్చిన ముఖ్యమంత్రులలో ఎక్కువగా నేనే నిర్భంధ అభివృద్ధి కేంద్రీకరణ కేవలం హైదరాబాద్ లోనే చేసాను అని చాలా చాలా వేదికలలో చెప్పుతు నేటికి కూడా చెప్పుతూనే ఉన్న వ్యక్తి 2014తెలంగాణ విభజనకు కారకుడై, ఇప్పుడు మన ఏపికి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాడు….. కానీ ఎన్నో త్యాగాలు చేసిన రాయలసీమ ప్రాంతంలో పుట్టిన ఈ పెద్ద మనిషి మరోసారి కూడా రాయలసీమ ప్రాంతాన్ని నయవంచనతో నిర్లక్ష్యము చేస్తూ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు…
……. గతాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఆ అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో “మరోసారి నిర్భంధ అభివృద్ధి కేంద్రీకరణ” చేయడానికి ప్రజల డబ్బులతో ప్రచార ఆర్భాటము కోసం ఈ వారం నుండి “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి” అంటూ అసెంబ్లీ లో తీర్మానము చేసి కేంద్రానికి పంపడం అక్కడ పార్లమెంటులో సంబంధం లేని విషయాన్ని చర్చించడానికి సభా సమయాన్ని వృదా చేయడం హాస్యాస్పదంగా ఉంది…… గతంలో ఎన్ డి ఏ ప్రభుత్వం మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు ఏ రోజు రాజధాని అంశంలో ఇంత భయంకరమైన ఆర్థిక విధ్వంశం జరగలేదు…
2014లో యుపిఎ ప్రభుత్వం పార్లమెంటులో చేసిన విభజన చట్టమే ఇంతవరకు ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అమలు చేయలేదు,,, ఎందుకు అమలు చేయడం లేదు అనే కీలకమైన అంశాలపై ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తీర్మానము చేసి పంపాల్సింది పంపకుండా రాజధాని విషయములో కేంద్రానికి ఎటువంటి సంబంధం గాని, సందేహం గాని లేదని గతంలో ఎన్నో సంధార్బాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్ పి లు అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానము చెప్పడం యావత్తు భారత దేశం గమనించింది……ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పేరుతో 11సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేస్తూనే ఉన్న ప్రచార ఆర్భాటము రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ఉపాధి అవకాశాలు చూపించకపోగా నేడు ఆ రైతులకు ప్రత్యక్షపు నరకానికి దారి చూపిస్తోంది అని ఇటీవల గుండె పగిలి చనిపోయిన అమరావతి రాజధాని రైతు రామారావు గారి ఉదంతమే మనకు ప్రత్యక్షపు నిదర్శనం గా కనబడుతోంది… ఏది ఏమైనా ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో ఉన్న తుంగభద్ర కృష్ణా నదులపై తరతరాలుగా ప్రాజెక్టులను నిర్మించ కుండ కుట్రలు కుతంత్రాలతో రాయలసీమ ప్రాంతాన్ని ఎడారి చేయడంలో నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన ఈ పెద్ద మనిషి పాత్ర మెుదటిది అని రాయలసీమ ప్రాంతంలో ఉన్న మేధావులు తరచూ చెబుతూనే ఉన్నారు….
ఎందుకంటే ఎప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేంద్రంలో చక్రం తిప్పడం మనమంతా తరతరాలుగా గమనిస్తూనే ఉన్నామ్ కాబట్టి రాయలసీమ ప్రాంతంలో ఉన్న తుంగభద్ర కృష్ణా నదులపై ప్రాజెక్టులను నిర్మించాలనే చిత్త శుద్ధి ఉండి ఉంటే ఎప్పుడో రాయలసీమ ప్రాంతంలో కూడా జాతీయ ప్రాజెక్టులను నిర్మించేవారు కానీ ఈ పెద్ద మనిషి నిర్మించ లేదు,,, కనీసం ఈ పెద్ద మనిషి శంకుస్థాపనలు చేసిన “గుండ్రేవుల వేదవతి ప్రాజెక్టు” ను గాని, “కడప ఉక్కు పరిశ్రమ” ను గానీ నిర్మించడం లేదు….. రాయలసీమ ప్రాంతంలో మాత్రమే ప్రాజెక్టులను నిర్మించ కుండ పక్క రాష్ట్రంతో ఈయనే కుట్ర చేసి “”రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు” ను కూడా నిద్వందంగా నిలిపివేయడంతో రాయలసీమ మేధావులు తరతరాలుగా చెబుతూనే ఉన్న మాటలు నిజమని అర్థం అయ్యిందని రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు తిప్పి రెడ్డి నాగార్జున రెడ్డి గారు తాడిపత్రి రఫ్ కార్యాలయంలో మీడియా సమావేశంలో తెలపడం జరిగింది…

