AP

ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి….

 

అసమానతలు, అజ్ఞానం రాజ్యమేలుతున్నప్పుడు ఒక్కడే నిలబడి “విద్యే శక్తి ” అని ప్రపంచానికి తెలియజేసిన గొప్ప యోధుడు పూలే….

వైయస్సార్ విద్యార్థి భాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లం రాజేంద్ర యాదవ్

కదిరి పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు
వైయస్సార్ విద్యార్థి విభాగం పట్టణ అధ్యక్షుడు సాయి నిఖిల్ రెడ్డి ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 200 వ జయంతిని పురస్కరించుకొని వైయస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లం రాజేంద్రయాదవ్, అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు షాహిద్ ఖాన్ పూలే చిత్రపటానికి ఘనంగా జయంతి నివాళులు అర్పించి ,శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వైయస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లం రాజేంద్ర యాదవ్ మాట్లాడుతూ భారత ప్రథమ సామాజిక తత్వవేత్త ఉద్యమకారుడు సంఘ సేవకుడైన జ్యోతిబాపూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని వ్యవసాయ కుటుంబంలో 1827 ఏప్రిల్ 11న జన్మించాడని ఏడు సంవత్సరాల వయసులో పూలే ఒక మరాఠీ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించాడని చిన్నప్పుడే మానవ హక్కుల ప్రాథమిక సూత్రాలపై జ్ఞానాన్ని సంపాదించి దేశభక్తి, నాయకత్వ గుణాలు అలవాటయ్యాయని, 17 ఏళ్ల ప్రాయంలో జ్యోతిరావు కి 9 సంవత్సరాల సావిత్రితో విహార వివాహం జరిగిందని అన్నారు . సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని పూలే భావించాడు అందువల్ల స్త్రీలు విద్యావంతులు కావాలని నమ్మాడు ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ముందుగా తన భార్య సావిత్రి పాఠశాలకు పంపి ప్రోత్సహించాడని అన్నారు. డిష్ ప్రభుత్వం ప్రాథమిక విద్యను నిర్లక్ష్యం చేయడంతో 1851- 52 ప్రాంతంలో రెండు పాఠశాలను స్థాపించి పేద బడుగు బలహీన వర్గాలకు విద్యను అభ్యసించాడని అన్నారు దుర్మార్గమైన కుల వ్యవస్థ సమూలంగా నిర్మూలన కావాలని ఆయన కోరుకున్నాడని తెలిపారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి పూలే తన గురువు అని ప్రకటించారని అన్నారు సమాజంలో వెనుకబడిన వర్గాల ప్రజలు మహిళల అభ్యున్నతి కోసం చేసిన కృషికి ఆయనకు మహాత్మా బిరుదు ఇచ్చారని, భారతదేశ సబ్బండ కులాల సామాజిక మార్పు కోసం తన జీవిత కాలయాన్ని త్యాగం చేసినం మహనీయుడు మాత్మ జ్యోతిరావు పూలే అని కొనియాడారు. జ్యోతీరావు పూలే ఒక్కరే కాదు ఆయన సతీమణి సావిత్రీ బాయిపూలే కూడా మహిళలకు చదువు ఎంతో అవసరమని చాటిచెబుతూ భారత దేశంలోనే మొట్ట మొదటి ఉపాధ్యాయురాలిగా ముందుకు రావడం గొప్పవిషయం.
జ్యోతీరావు పూలే ఆశయాల సిద్ధాంతంగా భావించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కులం,మతం, వర్గం, బేధం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారని అన్నారు. కావున వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం తరపున తాము విద్యారంగ సమస్యలపై పోరాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకం, పార్టీకి వెన్నెముకలా నిలబడి జగనన్న వెంట నడవడానికి సిద్ధంగా వున్నారని అన్నారు

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ విద్యార్థి విభాగం జిల్లా నాయకులు సోమేశ్ కుమార్ ,టౌన్ వైస్ ప్రెసిడెంట్ రోషన్, కార్యదర్శులు బాబా, షాదాబ్ , షఫీ ఉల్లా , ఫైజాన్ దినేష్, సుహేల్ పండు విద్యార్థులు పాల్గొన్నారు.