AP

రాష్ట్ర స్థాయి క్రికెటర్ తేజస్వినికి జనసేన నాయకుడు మల్లెం మోహన్ ప్రోత్సాహకం

పాత్రికేయ మిత్రులకు నమస్కారం

వర్ధమాన క్రికెట్ క్రీడాకారిణికి ప్రోత్సాహకం

కదిరి ACA – ADCA – RDT క్రికెట్ కోచింగ్ subcenter నుండి గత రెండు సంవత్సరాలనుండి వరుసగా under 15 బాలికల రాష్ట్ర జట్టుకు ఎంపిక అవ్వడమే కాక, U-15 జాతీయ క్రికెట్ క్యాంపు లో కూడా పాల్గొన్న క్రీడాకారిణి తెజేశ్వని కి కదిరి సీనియర్ క్రీడాకారులు మరియు జనసేన నాయకులు మల్లెం మోహన్( రాము ) ఇంగ్లీష్ విల్లో క్రికెట్ bat ను ప్రోత్సాహకంగ అందచేశారు…

ఈరోజు జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన B జట్టు సారథి తెజేశ్వని అద్భుత అర్ద సెంచరీ (54*)కి ,వేద, సన్నీ, నిర్వీజ్ఞ చెరో 16 పరుగుల సహకారం తో 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేశారు. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన A జట్టు 5 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేశారు విక్రమ్, మొహమ్మద్ చెరో 35 పరుగులు చేశారు

ఈ కార్యక్రమం లో కదిరి మండల క్రికెట్ సంఘం కార్యదర్శి ఎల్లప్ప, జాయింట్ సెక్రటరీ విజయ్, కోశాధికారి ముబారక్, జనసేన నాయకులు ET లోకేష్, కిన్నెర మహేష్, సీనియర్ క్రీడాకారులు ధీరజ్, సాయి ప్రణీత్, ప్లేయర్స్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు…
ధన్యవాదములు
కదిరి మండలం క్రికెట్ సంఘం..