నేపాల్ వరదల్లో ఇప్పటి వరకు దాదాపుగా 320 మంది భారతీయులు గల్లంతయ్యారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. దీంతో భారతీయులకు సహాయం అందించేందుకు 24 గంటలపాటు పనిచేస్తున్నామని తెలిపింది. వందమంది భారత మూలాలు ఉన్నవారు కూడా గల్లంతయ్యారని, 400 మంది భారతీయులు చైనాలో నిలిచిపోయారని తెలిపింది.
నేపాల్‌కు మరింత సహాయక సామాగ్రిని నేపాల్‌కు పంపుతున్నాము. చైనాలో చిక్కుకున్న 96 మంది భారతీయులు నేపాల్‌కి చేరుకున్నారని తెలిపింది. నేపాల్‌లో చిక్కుకున్న వారిని త్వరలో భారత్ తరలిస్తామని, తమిళనాడుకు చెందిన 21 మంది పర్యాటకులు ఖాట్మండు నుంచి ఢిల్లీ చేరుకున్నారని భారత విదేశాంగ శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు.

