హస్తకళాకారుల అభివృద్ధికి కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. క్లస్టర్లవారీగా కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుకు వేగంగా అడుగులు వేయాలని తెలిపారు. పార్వతీపురం మన్యం సీతంపేటలో సవర కళాకారుల సెంటర్ పనులను ప్రారంభించారు. వీబీ-జీ రామ్ జీ నిధులతో సవర కళాకారుల సెంటర్ నిర్మాణం చేయనున్నారు.
వీటికోసం మదనపల్లి, అనంతపురం, పెడనల్లో సెంటర్ల కోసం స్థలాల గుర్తించారు. త్వరలో మదనపల్లి, అనంతపురం, పెడనల్లో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని పవన్ తెలిపారు. ఉదయగిరి కమ్యూనిటీ సెంటర్ అభివృద్ధికి రూ.12 లక్షలు కేటాయించారు. ఎంపీ ల్యాడ్స్ నిధులతో ఉదయగిరి కమ్యూనిటీ సెంటర్‌కు మరమ్మతులు చేయనున్నారు. ప్రహరీ గోడ, మరుగుదొడ్లు, స్టోర్ రూమ్ నిర్మాణానికి నిధులు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఏటికొప్పాక ఆరోగ్య కేంద్రం పనులు పునఃప్రారంభం అయ్యాయి. హస్తకళాకారుల సంక్షేమానికి మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని పవన్ కళ్యాన్ తెలిపారు.
హస్తకళా ఉత్పత్తులపై క్యూఆర్ కోడ్ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలన్నారు. క్యూఆర్ కోడ్‌తో కళాకారుడి వివరాలు, శ్రమకు సంబంధించిన సమాచారం. హస్తకళలను గ్లోబల్ మార్కెట్లకు అనుసంధానించేలా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా హస్తకళాకారులకు ఉచిత వైద్య శిబిరాలు ఎర్పాటు చేస్తామని, ఆరు ఉచిత నేత్ర వైద్య శిబిరాల్లో 1,708 మందికి పరీక్షలు సుమారు 93 మందికి ఉచితంగా శుక్లాల ఆపరేషన్లు మరియు 1,253 మందికి పైగా ఉచిత కళ్లద్దాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని హస్తకళాకారులు పస్తులు ఉండకూడదని అన్నారు. పనికి ఆటంకం కలగకూడదని పవన్ కళ్యాణ్ అన్నారు.

