TELANGANA

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు..!

ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయింది. దానం నాగేందర్ అనర్హతపై అసెంబ్లీ కార్యదర్శి రేండ్ల తిరుపతి గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసారు. తెలంగాణ రాష్ట్రంలో 60వ అసెంబ్లీ నియోజకవర్గం ఖైరతాబాద్ ఉంది. దీంతో దానం నాగేందర్‌ను ఎమ్మెల్యేకు అనర్హుడిగా అసెంబ్లీ ప్రకటించింది. హైకోర్టు తీర్పును అనుసరించి అసెంబ్లీ కార్యదర్శి రేండ్ల తిరుపతి ప్రకటనను విడుదల చేసారు.

అయితే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే గత మార్చి 2024లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతే కాకుండా 2024 ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీతరుపున ఎంపీగా పోటీచేసారు. ఈ క్రమంలో ఓ పార్టీ నుండి గెలిచి మరో పార్టీతో ఎన్నిల్లో పోటీ చేయడంతో బి-ఫామ్ సాధించి ఎంపీగా పోటీ చేయడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని అప్పట్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్‌కి ఫిర్యాదు చేశారు.

అయితే పిటిషన్లపై విచారణ జరిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసేందుకు నిరాకరిస్తూ ఫిర్యాదును స్పీకర్ కొట్టివేశారు. దీంతో స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రతిపక్ష పార్టీనేతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు తీర్పును అనుసరించి నేడు అసెంబ్లీ కార్యదర్శి రేండ్ల తిరుపతి అనర్హత ప్రకటనను విడుదల చేసారు.