TELANGANA

సిరిసిల్ల గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి జోరుగా పాదయాత్ర..!

సిరిసిల్ల గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసారు. అనంతరం సరిసిల్లలో అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిద్యం వహిస్తున్న కోటలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పీసీసీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, రెవెన్యూ శాఖ మంత్రి పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్షణ్, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, ఆది శ్రీనివాస్ మరియ కాంగ్రెస్ ముఖ్య నాకుల మరియు కార్యకర్తలతో కలిసి జోరుగా పాదయాత్ర చేశారు.

అయితే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తొలిసారిగా కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించారు. అయితే గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సిరిసిల్ల గడ్డపై అడుగుపెట్టిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు సీఎం అయ్యాక భారీ బహిరంగ సభతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో కాంగ్రెస్ శ్రేణుల్లో సీఎం రేవంత్ రెడ్డి నూతనోత్సాహాన్ని నింపి భారీగా పాదయాత్ర చేపట్టారు.